రాణా కప్పని చూసిన నేహా చౌదరి!
on Feb 26, 2024

కప్పలు ఎన్ని రకాలు.. మనకి తెలిసినవి రెండో మూడో రకాలు అంతేగా కానీ ప్రపంచంలోని వివిధ దేశాలలో విభిన్న కప్పలున్నాయంటు బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ నేహౌ చౌదరి ఓ వ్లాగ్ లో తెలిపింది.
నేహా చౌదరి పెళ్ళి తర్వాత జర్మనీకి వెళ్లింది. అక్కడ తన భర్తతో కలిసి వ్లాగ్స్ చేస్తూ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది. అయితే స్పెయిన్ లోని అండర్ వాటర్ ఆక్వేరియం చూడడానికి వెళ్ళిన నేహా.. అక్కడ కప్పలలోని విభిన్నమైన, వింతైన రాణా కప్పని చూసిందంట. అదే అన్నింటికంటే పురాతనమైన, మరియు పెద్ద కప్ప అని చెప్తూ వ్లాగ్ చేసింది. ఇదంతా తన భర్త అనిల్ తో కలసి చేయడంతో ఇది వైరల్ గా మారింది. నేహా చౌదరి హోమ్ టూర్, ట్రావలెంగ్ టూర్స్ అంటు ఎప్పుడు తన భర్త అనిల్ ని ఇబ్బంది పెడుతూనే ఉంటుందంటు చాలామంది కామెంట్లు కూడా చేస్తుంటారు. వాటినేం లెక్క చేయకుండా రకరకాల వ్లాగ్స్ చేస్తూ ప్రతీ చిన్న విషయాన్ని వ్లాగ్స్ చేస్తూ నెట్టింట ఎప్పుడు వైరల్ అవుతుంటుంది నేహా.
నేహా తన కెరీర్ ని యాంకరింగ్ తో మొదలుపెట్టింది. చిన్నప్పటి నుండి తనకి యాంకరింగ్, యాక్టింగ్ మీద ఆసక్తి ఉండేదంట. విమెన్ వరల్డ్ కప్ ప్రోకబడ్డికి కూడా రెప్రెజెంటెర్ గా చేసింది నేహా. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీతో ఒక్కసారిగా సెలెబ్రిటీ జాబితాలోకి చేరింది నేహా. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాకే నేహాకి పెళ్లి జరిగింది అది కూడా బిగ్ బాస్ 6 గ్రాండ్ ఫినాలే రోజే నేహా పెళ్లి జరిగింది.. నేహా పెళ్లి కూతురు గెటప్ లోనే గ్రాండ్ ఫైనల్ కి అటెండ్ అయిన విషయం అందరికి తెలిసిందే. నేహా తన సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ని స్టార్ట్ చేసి తన ప్రతీ అప్డేట్స్ ని ఫ్యాన్స్ కి తెలియజేస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



